అమ్మ దొంగా…!

కృష్ణగిరి : కృష్ణగిరి జిల్లా సూలగిరిలోని ఓ దుకాణం ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తున్న దృశ్యం ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. బెప్పాలపల్లి గ్రామానికి చెందిన రమేష్, బుధవారం సాయంత్రం సొంత పనుల మీద సూలగిరికి వచ్చి ఓ దుకాణం ముందు తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రమేష్ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి అక్కడి నుండి జారుకున్నాడు. దుకాణం నుంచి తిరిగి వచ్చిన రమేష్ తన ద్విచక్ర వాహనం అదృశ్యం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి సమీప దుకాణాల్లో ఉంచిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ వ్యక్తి రమేష్ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తున్న దృశ్యం అందులో అగుపించింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ కోసం గాలిస్తున్నారు.

తాజా సమాచారం