బిగ్‌ బాస్‌లో చెప్పుదెబ్బలు

బిగ్‌ బాస్‌లో చెప్పుదెబ్బలు

ముంబై: బిగ్బాస్ 13 హిందీ సీజన్లో పాల్గొన్న ఇద్దరు-విశాల్, మధురిమ సోమవారం చెప్పులతో కొట్టుకుని రచ్చకెక్కారు. అక్కడి తోట పరిసరాల్లో విశాల్ కోపంతో మధురిమను నోటికొచ్చినట్లు తిట్టాడు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆమెను దుర్భాష లాడాడు. దీంతో ఆవేశానికి లోనైన మధురిమ విశాల్కు చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోయింది. పశ్చాత్తాప గదిలో సల్మాన్ ఖాన్ పంచాయతీ చేసారు. శారీరక హింసకు పాల్పడేవాళ్లను ఇంట్లో ఇనుమతిస్తారా? అని విశాల్ ప్రశ్నించాడు. మధురిమతో కలిసి తాను ఉండలేనన్నాడు. చెప్పుతో కొట్టడం తప్పేనని విశాల్కు మ ధురిమ క్షమాపణలు చెప్పింది. ఈ గొడవలో అతని తప్పు కూడా ఉందని ఎత్తి చూపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos