బిగ్ బాస్ హోస్ట్‌గా రోజా..!

  • In Film
  • October 16, 2020
  • 21 Views
బిగ్ బాస్ హోస్ట్‌గా రోజా..!

ఎన్నో అంచనాలతో మొదలైన బిగ్ బాస్ 4 అంచనాలకు తగ్గట్టే సాగుతోంది.ఐపీల్ తో పోటీని తట్టుకుంటూనే జనాలను బాగానే ఆకట్టుకుంటోంది.ఇక శని,ఆది వారాల్లో హౌస్ సభ్యులతో ఆటలాడిస్తూ చివర్లో ఎలిమినేట్ చేస్తూ సందడి చేసే కింగ్ నాగార్జున కొన్ని వారాలపాటు బిగ్ బాస్ కు దూరం కానున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.నాగార్జున ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ సినిమాకు బల్క్ డేట్స్ కేటాయించాడు. ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం నాగ్ బిగ్ బాస్ షోకు దూరమయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కోసం పర్మిషన్లు దొరకడంతో బిగ్ బాస్ షోకు నాగ్ తప్పనిసరిగా దూరం కావాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో హోస్ట్ గా ముందుగా రమ్యకృష్ణను అనుకున్నప్పటికీ తరువాత మనసు మార్చుకొని తెలుగు రాష్ట్రాల్లో మాస్‌లో ఫాలోయింగ్ ఉన్న రోజాతో హోస్ట్ చేయించాలనే నిర్ణయానికి వచ్చారట.ఇప్పటికే రోజా.. జబర్ధస్త్ వంటి కామెడీ షో జడ్జ్‌గా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఈ వారంతో బిగ్‌బాస్ ఆరో వారం కంప్లీట్ చేసుకోబోతుంది. ఏడో వారంలో అడుగుపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో ఫైనల్ ఎపిసోడ్ దాకా నాగార్జున ఉండకపోవచ్చనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా ఈ సారి 10 వారాలే బిగ్‌బాస్ షోను రన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు బిగ్‌బాస్ షో నిర్వాహకులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos