డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్

డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్

న్యూ ఢిల్లీ : తమ భూభాగంలో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని వార్తల్ని భూటాన్ ఖండించింది. అలాంటిదేమీ జరగలేదని భారత్ లో భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్గైల్ స్పష్టీకరించారు. ‘చైనా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఒక గ్రామాన్ని కట్టిందన’ని చైనాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షెన్ షివే ట్వీట్ చేశారు. ‘నేను ఆ ట్వీట్ని చూశాను. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అని మేజర్ జనరల్ వెట్సాప్ నామ్గైల్ అన్నారు. చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్లోని సీనియర్ ప్రొడ్యూ సర్గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసులు ఉన్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కి.మీ దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబం ధించిన ఫోటోలని ట్వీట్ చేశారు. ఆ తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్ను భారత్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్ చేసి ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos