పోర్లు దండాలు పెట్టిన రైతు? దేనికోసమంటే?

పోర్లు దండాలు పెట్టిన రైతు? దేనికోసమంటే?

భోపాల్ : తన భూమి కోసం ఓ రైతు అధికారుల ఆఫీసు చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ రైతు వినూతన్నంగా ఆలోచించి సోషల్మీడియా ద్వారా తన సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..?! మధ్యప్రదేశ్కి చెందిన ఆ రైతు పేరు శంకర్లాల్ పాటిదార్. తనకున్న కొద్దిపాటి భూమిని బాబు దేశ్ముఖ్ అనే అతను కబ్జా చేసుకుని నకిలీ పత్రాలతో తన పేరున రిజిష్టర్ చేయించుకున్నాడు. దీంతో శంకర్లాల్ న్యాయపోరాటానికి దిగాడు. దేశ్ముఖ్ అక్రమంగా తన భూమిని లాక్కొని రిజిష్టర్ చేయించుకున్నాడని.. అసలైన ధృవ పత్రాలతో మాంద్సౌర్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అతని భూమి కబ్జా చేసుకున్న దేశ్ముఖ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తుండడంతో.. తన పలుకుబడితో శంకర్లాల్ సమస్యను కలెక్టర్కి తెలిపే అవకాశం లేకుండా చేశాడు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న శంకర్లాల్ చివరికి కలెక్టర్ కార్యాలయంలో.. గుడిలో పొర్లుదండాలు పెట్టినట్లు.. తాను కూడా అదేవిధంగా పొర్లుదండాలు పెడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. బంధువుల సాయంతో తీసిన ఈ వీడియోను సోషల్మీడియాలో పోస్టు చేయగా.. ఈ విషయం జిల్లా మెజిస్ట్రేట్ దిలీప్ యాదవ్ దృష్టికి వెళ్లింది. శంకర్లాల్ సమస్యని పరిష్కరించి తనకు న్యాయం చేస్తానని దిలీప్.. ఆ రైతుకు భరోసా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos