ఆయుధాలు అమ్మడానికా ఇండియా వెళ్లింది

ఆయుధాలు అమ్మడానికా ఇండియా వెళ్లింది

వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన తీరును అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ మంగళ వారం ట్వీట్ లో ఆక్షే పించారు.ఆయుధాలు అమ్ముకోవడానికి ఇండియా వెళ్లారా? అని ట్రంప్ను ప్రశ్నించారు. . దానికి బదులు వాతావరణ మార్పులపై పోరా టం,కాలుష్యాన్ని తగ్గించడం, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ఒప్పందాలు చేసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఆయుధాల అమ్మ కాలు,ఒప్పందాల వల్ల అమెరికాలోని ఆయుధాల కంపెనీలకే లాభమని బెర్నీ శాండర్స్ అన్నారు. ‘‘రూ.21 వేల కోట్ల విలువైన ఆయు ధాలు,యుద్ధ హెలికాప్టర్లు వంటివి ఇండియాకు అమ్మడం వల్ల అమెరికాలోని రేథాన్, బోయింగ్, లాక్ హీడ్ వంటి పెద్ద పెద్ద కంపెనీలకే లాభం. అమెరికా ఇండియాతో కలిసి వాతావరణ మార్పులపై పోరాడాలి. గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, పునరుత్పాదక ఇంధన వన రులపై కలిసి పనిచేయాలి. మన భూమిని కాపాడుకోవాలి’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos