రహదారి, విద్యుత్‌లకోసం ఎన్నికల బహిష్కరణ

రహదారి, విద్యుత్‌లకోసం  ఎన్నికల బహిష్కరణ

ముంబై: నందూర్బార్ జిల్లా మనిబేలి గ్రామస్థులు శాసనసభ ఎన్నికల్ని బహిష్కరించారు. గ్రామంలోని ఓటర్ల సంఖ్య 135. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక్కరు కూడా ఓటు వేయ లేదు. పోలింగ్ను బహిష్కరించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. గ్రామంలో కరెంట్, రహదారి సదుపా యాలు లేక పోవడమే ఇందుకు కారణం. దేశంలో నూటికి నూరు శాతం విద్యుత్ సదుపాయాన్ని సాధించామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నా రాష్ట్ర విద్యుత్ బోర్డు దృష్టిలో ఈ గ్రామం లేకపోవడం శోచనీయం. రాజకీయుల వెంటబడి కరెంట్ కావాలి, రోడ్డు కావాలి అంటూ తిరిగే ఓపిక తమకు లేనందున ఆఖరి అస్త్రంగా శాసనసభ ఎన్నికల్ని బహిష్కరించినట్లు నటర్వ్ భాయ్ టాడ్వీ ( 60) తెలిపారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ కింద రెండేళ్ల కిందట తమ గ్రామానికి మంజూరయిన ఎనిమిది కి.మీల రహదారి రు కాగితాలకే పరిమితం అయిందని గ్రామస్థులు తెలిపారు. అడవి, నర్మదా నది వెనుక జలాల మధ్య ఉన్న ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని తెల్సింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న నదూర్బార్ జిల్లాలో ఈ గ్రామం ఉండడం కూడా ఓ శాపంగా మారింది.

తాజా సమాచారం