బప్పి లహరిని బలితీసుకున్న అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా

బప్పి లహరిని బలితీసుకున్న అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా

ముంబై ; సంగీత దర్శకుడు బప్పి లహరి అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) సమస్య కారణంగా గుండె ఆగిపోయి మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. నిద్రిస్తున్నపుడు అప్పర్ ఎయిర్ వేస్ (శ్వాస తీసుకునే ఎగువ భాగంలో) మూసుకు పోతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని మరింత వ్యాకోచింప చేసి, గాలిని ఊరితి తిత్తుల్లోకి పంపించేందుకు వీలుగా ఛాతీ కండరాలు బలంగా పని చేస్తాయి. అప్పుడు పెద్ద ఊపుతో లేచి గాలి తీసుకుంటారు. ఈ సమస్య ఉన్న వారికి మంచి నిద్ర పట్టదు. దీర్ఘ కాలంలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గాలి సరిపడా అందకపోవడంతో లేచి గాలి తీసుకోవాలని మెదడు సంకేతాలు ఇస్తుంది. స్లీప్ అప్నియా లేదా సెంట్రల్ స్లీప్ అప్నియాలో మెదడు సంకేతాలు ఇవ్వదు. దీంతో మధ్య మధ్యలో శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. శ్వాసనాళ కండరాలు మూసుకుపోవడం వల్ల ఓఎస్ఏ సమస్య ఏర్పడుతుంది. నిద్ర సమయంలో గొంతు భాగంలో సాఫ్ట్ టిష్యూ వ్యాకోచించడం వల్ల గాలి వెళ్లే మార్గానికి అడ్డు పడుతుంది. స్థూలకాయం, టాన్సిల్స్ వాపునకు గురికావడం, ఎండోక్రైన్ డిజార్డర్లు, గుండె విఫలం కావడం వంటి సమస్యలున్న వారికి ఓఎస్ఏ ఎదురవుతుంది. పెద్దగా గురకపెట్టడం స్లీప్ అప్నియాకు సంకేతంగా చూడాలి. పగటి పూట ఎక్కువ నిద్ర పోవడం కూడా సమస్యకు దారితీస్తుంది. ఒక పరికరాన్ని తలకు ధరించి పడుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజర్ ను పంపిస్తుంది. దాంతో అవి తెరచుకుంటాయి. దీనివల్ల గురక రాకుండా, శ్వాసకు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోవచ్చు. దీనికి శస్త్రచికిత్స కూడా ఉంది. బరువు తగ్గించు కోవడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. స్లీప్ అప్నియా సమస్యలున్న వారు జీవిత కాలాన్ని 12-15 ఏళ్లపాటు తగ్గిస్తుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos