CloseX గృహనిర్బంధంలో బండి సంజయ్

CloseX గృహనిర్బంధంలో బండి సంజయ్

జగిత్యాల : నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఆయన ఐదో విడత పాదయాత్ర కోసం నిన్న రాత్రి భైంసాకు వెళ్తున్న భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో అడ్డుకున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించి బయటకు రావద్దని ను బంధించారు. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ వ్యాజ్యాన్ని దాఖలు చేయనుంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నంకల్లా పాదయాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పాదయాత్ర ప్రారంభం కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత అయోమయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాకపై అనుమానం నెలకొంది. మరోవైపు, పాదయాత్రకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రజా స్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విమర్శిస్తున్నాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos