ఆసుపత్రిలో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ

ఆసుపత్రిలో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ

హిందూపురం: ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పని తీరు సరిగా లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆసుపత్రి ని, పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు.రోగుల యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు. కొందరు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, ప్రైవేట్ క్లినిక్ లకు వెళ్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు కొందరు ఆయనకు ఫిర్యాదుచేసారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ నాలుగు రోజుల క్రితం చనిపోయిందని ఒకరు ఆవేదన చెందారు. దీంతో వైద్యులపై బాలయ్య మండి పడ్డారు. చర్యలు తీసుకుంటానని హెచ్చ రించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వైద్యుల పని తీరుకి, ఇప్పటి పనితీరుకి తేడా ఉందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos