అయోధ్య తీర్పుపై సవాల్‌ వ్యాజ్యం

అయోధ్య తీర్పుపై సవాల్‌ వ్యాజ్యం

న్యూఢిల్లీ : అయోధ్య వివాదస్పద స్థలం గురించి అత్యున్నత న్యాయ స్థానం తీర్పును సవాలు చేస్తూ జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దేశంలోని మెజారిటీ ముస్లిం లు అయోధ్య తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నారని ఆ అధినేత మౌలానా అర్షద్ మదాని పేర్కొన్నారు.‘అయోధ్య తీర్పును సవాలు చేయటం కోర్టు తమకు ఇచ్చిన హక్కు. మంది రాన్ని కూల్చి మసీ దును నిర్మించారనే వివాదస్పద అంశానికి ఆధారాలు లేవు. కోర్టూ ఇదే చెప్పింది. తీర్పు మాత్రం దీనికి వ్యతిరేకంగా వెలువడింది. అందు వల్లే మేము రివ్యూ పిటిషన్ దాఖలు చేసామ’న్నారు.‘99 శాతం మంది ముస్లింలు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతు న్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎం పీఎల్బీ) పేర్కొంది. డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపింది. సున్నీ వక్ఫ్ బోర్డు రివ్యూ పిటిషన్ వేయబోమని పేర్కొంది.

తాజా సమాచారం