విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తునకు డిమాండ్

విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తునకు డిమాండ్

జైపూర్ : అయోధ్య రామాలయం నిర్మాణ విరాళాలు దుర్వినియోగమైన ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు జరిపించి, దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్ర భుత్వాన్ని మంగళవారం వరుసల ట్వీట్లలో డిమాండ్ చేశారు. ‘విరాళాలు ఇచ్చిన వారిలో అత్యధికులు రాజస్థానీలు. నిధుల దుర్వినియోగాగ వార్తలు భక్తులను తీవ్రంగా కలచివేసింది. దేశవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రాజస్థానీలు ఎంతో భక్తితో విరాళాలు ఇచ్చారు. ర్మాణం ప్రారంభంలోనే నిధుల దుర్వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణలు సామాన్యులను దిగ్భాంతికి గురి చేస్తున్నాయి. . రాష్ట్రంలోని బన్షీ పహర్పూర్లో చట్టవిరుద్ధంగా గనులను తవ్వి, పింక్ స్టోన్ను తీసి, రామాలయం నిర్మాణానికి పంపించారు. తర్వాత దానికి చట్టబద్ధతను పొందారు. రామాలయ నిర్మాణం వంటి పవిత్రమైన కార్యక్రమంలో సైతం కుంభకోణాలకు పాల్పడటాన్ని ఎవరూ ఊహించలేర’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos