మంచం పైనే మనువు

మంచం పైనే మనువు

ప్రయాగరాజ్ :వధువు గాయపడినప్పటికీ వరుడు అవధేశ్ ఆమెను వివాహమాడి అందరి మన్ననల్ని అందుకున్నారు. పెళ్లి కూతురు ఆర్తి ఒక చిన్నారిని కాపాడేందు ప్రయత్నించి మెట్ల నుంచి కిందకు జారి పడ్డారు. కూలడంతో వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. పెద్ద మనసున్న పెళ్లి కొడుకు అనుకున్న ముహూర్తానికే గాయాలతో మంచంపై ఉన్న ఆర్తి మెడలో తాళి కట్టాడు. అందరూ ప్రశంసించారు. కష్ట సమయంలో పెళ్లి కూతురికి తాను మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అవధేశ్ అన్నాడు. ఈ పరిస్థితి వచ్చినందుకు తాను భయపడ్డానని ఆర్తి చెప్పింది. అయితే, వరుడు తనకు అండగా నిలిచాడని ఆనందించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos