ఆదుకోవాలంటూ ఆటో కార్మికుల ఆందోళన

ఆదుకోవాలంటూ ఆటో కార్మికుల ఆందోళన

హొసూరు : ఆటోలను నడుపుతూ జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం  ఆందోళన నిర్వహించారు. హొసూరు సమీపంలోని ఆర్డీవో కార్యాలయం ముందు కార్మికులు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తిరుగుతున్న కాల్ టాక్సీల వల్ల ఆటో కార్మికులు జీవన భృతిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక హొసూరులో కాల్ టాక్సీ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్టు రూ.10 వేల ఆర్థిక సహాయం కోరారు. బీమా కంపెనీలు తరచూ ప్రీమియం మొత్తాన్ని పెంచుతున్నాయని, దీనివల్ల ఆటోలపై బీమా  చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీపీఆర్ఎస్ మీటర్లను ఆటో కార్మికులకు ఉచితంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులపై ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆందోళనలో ఆటో సంఘాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos