మహిళా క్రికెటర్‌కు మైదానంలో ప్రపోజ్..

  • In Sports
  • October 21, 2019
  • 90 Views
మహిళా క్రికెటర్‌కు మైదానంలో ప్రపోజ్..

మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం సహచర క్రీడాకారిణిలతో కలసి సంబరాలు చేసుకుంటున్న ఆస్ట్రేలియా మహిళ క్రికెటర్ను ఆమె బాయ్ఫ్రెండ్ మైదానంలోనే ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేశాడు.మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెన్‌గేడ్స్‌-అడిలైడ్ స్ట్రైకర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం స్ట్రైకర్స్ జట్టు సభ్యురాలు అమందా సహచర క్రీడాకారిణిలతో కలసి సంబరాలు చేసుకుంటోంది.ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన అమందా ప్రేమికుడు టేలర్ మెక్కిచీ మైదానంలోనే పెళ్లి ప్రస్తావన చేశాడు.పెళ్లి చేసుకుంటానంటూ మోకాళ్లపై కూర్చొని మైదానంలోనే అమందాకు ప్రపోజ్ చేశాడు.జట్టుతో కలిసి గ్రూప్ ఫొటో దిగుతున్న సమయంలో ఆమె ప్రియుడు టేలర్ మెక్కిచీనీ మైదానంలోకి వచ్చి ఉంగరాన్ని చూపిస్తూ ఆమె చేతిని తనకు అందివ్వాల్సిందిగా కోరాడు. మైదానంలో జట్టు సహచరుల మధ్య ఈ సంఘటనకు ఊహించని అమందా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. అయితే, ఆ తర్వాత సిగ్గుతోనే తన చేయిని టేలర్‌కు అందించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos