అతడు @ 15

  • In Film
  • August 10, 2020
  • 159 Views
అతడు @ 15

ఎన్నిసార్లు చుసిన బోర్ కొట్టని సినిమా జాబితాలో త్రివిక్రమ్,మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు చిత్రం తప్పనిసరిగా ఉంటుంది.కథ,కథనాలతో పాటు పాటలు,సంగీతం,విజువల్స్ ఇలా అన్ని కలిపి అతడు చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా నిలిపాయి.ముఖ్యంగా మహేష్ లో మరో కోణాన్ని చూపిన చిత్రంగా మహేష్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది.అతడు సినిమా విడుదలయ్యి నేటితో 15 ఏళ్లవుతోంది. సోషల్ మీడియాలో అభిమానులు సినిమాకి సంబంధించిన స్పెషల్ లుక్స్ ని వైరల్ అయ్యేలా చేస్తున్నారు.నువ్వే నువ్వే చిత్రం అనంతరం 2002 లోనే అతడు కథను సిద్ధం చూసుకునే పనిలో పడ్డ త్రివిక్రమ్ కథ పూర్తవగానే మొదట త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి వినిపించాడు. కానీ పవన్ కళ్యాణ్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు.పైగా అతడు కథ చెబుతుండగా పవన్ కళ్యాణ్ నిద్రపోయాడు అని ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ చెప్పాడు. అనంతరం మహేష్ బాబుకి వినిపించడంతో వెంటనే చేద్దామని ఒప్పేసుకున్నాడు. కానీ అప్పుడు ఎస్ జె.సూర్య నాని సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అవుతుందని అన్నాడు. అయినప్పటికీ త్రివిక్రమ్ పట్టు వడాలకుండా మూడేళ్ళ వరకు ఎదురు చేశాడు.ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా త్రిష సెలక్ట్ కాగా సోనూ సూద్ ముఖ్య పాత్రలో నటించారు. అనంతరం నాజర్ చేసిన గ్రాండ్ ఫాదర్ పాత్ర కోసం మొదట శోభన్ బాబును అనుకున్నారు. కానీ అప్పటికే సినిమాలకు చాలా దూరంగా ఉండడంతో నిర్మాత మురళి మోహన్ చెక్ పంపినా కూడా మళ్లీ వెనక్కి పంపించేశారు.రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో అప్పుడు బిజీగా ఉండడం వలన శోభన్ బాబు ఆ పాత్ర చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అనంతరం నాజర్ ని ఫైనల్ చేసి sp.బాలసుబ్రహ్మణ్యం చేత వాయిస్ ఓవర్ ఇప్పించారు. ఆ క్యారెక్టర్ సినిమాలో హైలెట్ గా నిలిచింది.అతడు సినిమా ఇప్పటికి టీవీలలో వచ్చినా మంచి రేటింగ్ అనుకుంటోంది.అలాంటి సినిమా ఈ రోజుల్లో వచ్చి ఉంటే ఇండస్ట్రీలో ఒక సంచలన విజయాన్ని అందుకునేది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos