‘లవ్జిహాద్’ జంట ఒక్కటైంది

‘లవ్జిహాద్’ జంట ఒక్కటైంది

ముంబయి : నాసిక్ నివాసి ప్రసాద్ అద్గావ్కర్ తమ 28 ఏళ్ల కుమార్తెను ఒక ముస్లిం తో హిందూ సాంప్రదాయంలో వివాహం చేయడాన్ని ‘లవ్జిహాద్’ పేరిట బంధువులు వ్యతిరేకించటంతో పెళ్లి ఆగిపోయింది. గత గురువారం ఆ జంట ఒక్కటైంది. నాసిక్లోని ప్రముఖ నగల ప్రసాద్ అద్గావ్కర్ ఈ నెల 18న తన కుమార్తె రషిక లగ్న పత్రికల్ని పంచారు. పెళ్లి కుమారుడు ఆసిఫ్ ఖాన్ ముస్లిం కావడంతో ఆందోళనలు మొదలయ్యాయి. ఇది లవ్ జిహాద్ అంటూ మెసేజ్లు, కాల్స్ మీద కాల్స్, తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చాయి. రాష్ట్ర మంత్రి బచ్చు కాడు జోక్యం చేసుకుని రషిక- ఆసిఫా వివాహానికి మద్దతు తెలిపారు. కొన్ని సంస్థలతో పాటు రాజకీయ నేతలు కూడా ఇదే బాటలో నడిచారు. ఈ జంట గురువారం ఒక్కటైంది. రెండు మతాల సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అంతకుముందు ఈ వివాహాన్ని వ్యతిరేకించి వారంతా వాస్తవాన్ని మద్దతునిచ్చారు. లవ్జిహాద్, బలవంతపు మత మార్పిడి కాదని, ఇప్పుడు అర్థం చేసుకోవడం తో ఎంతో సంతోషంగా ఉందని పెళ్లి కుమార్తె తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos