నాకు కరోనా లేదు

నాకు కరోనా లేదు

చెన్నై: తనకు కరోనా వ్యాపించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని విఖ్యాత నటుడు కమల హాసన్ శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో స్పష్టీకరించారు. ఇక్కడి ఆళ్వార్ పేటలో ఆయన ఒకప్పుడు నివసించిన ఇంటికి ‘ఆ ఇంట్లోని వారు క్వారంటైన్లో ఉంటున్నార’ని అధికార్లు స్టిక్కర్ కరిపించటమే దీనికి కారణం. ఆ ప్రాంతంలో చాలా మంది ఇళ్లకు ఇటువంటి స్టిక్కర్లు అతికించారు. పొరపాటుగా కమల్ ఇంటికి ఆ స్టిక్కర్ అంటించామని తాజాగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ స్పష్టీకరించింది. అయినా ఆయన క్వారంటైన్లో ఉన్నట్లు సాగుతున్న తప్పుడు ప్రచారం ఆగట్లేదు.‘వార్తలు రాసేముందు నిజమేంటో తెలుసుకోండి. అసత్య వార్తలు ప్రచారం కాకుండా న్యూస్ ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను గృహ నిర్బంధంలో ఉంటున్నానని వస్తోన్న ప్రచారంలో నిజం లేదు. స్టిక్కర్ అంటించిన ఇంట్లో నేను చాలా ఏళ్లుగా ఉండట్లేదు. ఈ విషయం చాలా మందికి తెలుసు. మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యకలాపాలు అక్కడి నుంచి జరుగు తున్నా య’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos