మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే దుర్గా మండపాలపై దాడులు

మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే దుర్గా  మండపాలపై   దాడులు

ఢాకా : దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే దుర్గా పూజ మండపాలపై కుట్ర పూరితంగా దాడులు చేశారని హోంశాఖ మంత్రి అసదుజ్జామాన్ ఖాన్ ఆరోపించారు. గత వారం దుర్గా పూజ ఉత్సవాల పందిరి వద్ద ఖురాన్ ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో హింసాకాండ చెలరేగింది. ఖురాన్ అపవిత్రం జరిగిందనే వార్త వ్యాప్తి చెందడంతో పలు దుర్గా పూజ మండపాలు, దేవాలయాలపై దాడి చేశారు. విధ్వంసకారులు హిందువుల దుకాణాలు, ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. హింసా కాండ, కాల్పుల ఘటనలపై నాలుగు వేలకు పైగా కేసులను బంగ్లాదేశ్ పోలీసులు నమోదు చేశారు. దేశంలో హింసా కాండను ప్రేరేపించడం వల్లనే గాజీపూర్, బందర్ బన్, చాపైనావాబ్గంజ్, చంద్పూర్, చిట్టగాంగ్, మౌల్విబజార్లలో ఘటనలు చెలరేగాయని మంత్రి చెప్పారు.హింసాకాండ కేసుల్లో తాము అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత మరిన్ని వివరాలను బహిరంగపరుస్తామని పేర్కొన్నారు. బాధ్యులైన వారికి కఠినమైన శిక్షిస్తామని ప్రధాన మంత్రి షేక్ హసీనా కూడా హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్లో దుర్గా పూజ పందిళ్లు, హిందువులపై దాడులకు వ్యతిరేకంగా చిట్టగాంగ్లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos