యోగి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారు

లక్నో: యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రయాగ్ రాజ్లో హింసా కాండకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని కూల్చివేసిన కొన్ని గంటల తర్వాత అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘యూపీ ముఖ్యమంత్రి యోగి అలహాబాద్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా?’’ అని గుజరాత్లోని కచ్ నగరంలో జరిగిన ర్యాలీలో ప్రశ్నించారు. సహరాన్ పూర్లో అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లను కూల్చివేశారు.రాళ్లదాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి జావేద్ అహ్మద్ను అరె స్టు చేసినట్లు ప్రయాగ్రాజ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ కుమార్ తెలిపారు.టీవీ చర్చ సందర్భంగా ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను పలు ఇస్లా మి క్ దేశాలు ఖండించడంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos