డబ్బంతా మంత్రిదే

డబ్బంతా మంత్రిదే

కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్టు నటి అర్పిత తెలిపారు. ‘ఒక బెంగాలీ నటుడు నన్ను మంత్రికి పరిచయం చేసారు. మా ఇంట్లో దొరికిన రూ. 21కోట్ల డబ్బు పార్థా ఛటర్జీదే. మా ఇంట్లో ఉన్న ఓ రూమ్లోనే డబ్బును దాచాడు. మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంక్లా వాడుకున్నారు. మా ఇంట్లోని రూమ్కు ఫుల్ సెక్యూర్టీగా పార్థా మను షులే ఉండేవారు. వారు మాత్రమే రూమ్ లోపలి వెళ్లి వచ్చేవారు. పార్థా ఛటర్టీ.. వారంలో ఒక్కరోజు లేదా 10 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్లి డబ్బులు చెక్ చేసుకునే వారు. ఆ డబ్బంతాకాలేజీల విషయంలోనే లంచాల రూపంలో వచ్చింద’ని వివరించింది. వీరిద్దరూ ఆగస్టు 3వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos