ఇండియన్ ఆర్మీ అంటే ఇదీ..

ఇండియన్ ఆర్మీ అంటే ఇదీ..

భారత సైన్యం చేసిన పనికి సామజిక మాధ్యమాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 13న ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్పీవో) రెండు ఏకే-47 తుపాకులతో కనిపించకుండాపోయాడు. అదే రోజు చదూర ప్రాంతంలో జహంగీర్ భట్ అనే యువకుడూ ఆచూకీ లేకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కోసం వాళ్ల కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం జరిపిన ఓ ఆపరేషన్లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతడు జహంగీరే అని జవాన్లు గుర్తించారు.జహంగీర్ తండ్రిని ఎన్కౌంటర్ జరుగుతున్న స్థలానికి తీసుకొచ్చారు. లొంగిపోవాలని ఆయనచేత చెప్పించారు. భయంతో వణుకుతూ తోటలో ఓ పొదల చాటున దాక్కున్న జహంగీర్కు తండ్రి మాట విని ప్రాణం లేచివచ్చింది. ‘దేవుడి మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం నీకేం కాదు. నిన్నెవరూ కాల్చరు. వచ్చి లొంగిపో’ అని జవాన్ ఇచ్చిన హామీపై నమ్మకం కలిగింది. తుపాకీని పక్కనబెట్టి..చేతులు పైకెత్తి.. నెమ్మదిగా జవాన్ల వద్దకు చేరుకున్నాడు.అలా వచ్చిన జహంగీర్కి తాగడానికి నీళ్లిచ్చి సైనికులు ధైర్యం చెప్పారు. తప్పులు జరుగుతుంటాయి..నీకు ఏమీ కాదని భరోసా కల్పించారు. తన కొడుకును ఉగ్రవాదం ఉచ్చు నుంచి కాపాడినందుకు జహంగీర్ తండ్రి జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అతనికీ ధైర్యం చెప్పిన సైనికులు ఇంకెప్పుడు తన కొడుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos