మిన్సార కన్నాయే పారాసైట్‌ మాతృకా?

మిన్సార కన్నాయే పారాసైట్‌ మాతృకా?

చెన్నై: తొలిసారి ఆస్కార్ పురస్కారాన్ని పొందిన కొరియన్ చిత్రం – పారాసైట్ తమిళ హీరో విజయ్ నటించిన ‘మిన్సార కన్నా’ చిత్రా నికి నకలు కావచ్చని కొందరు నెటిజన్ల అభిప్రాయం. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన ‘మిన్సార కన్నా’ సినిమాతో ‘పారసైట్’కు పోలికలు ఉన్నాయి. బహుశా కొరియన్ దర్శకుడు ఈ సినిమాతో స్ఫూర్తి పొంది ఆ కథనే కొంచెం మార్చి పారసైట్ తీసి ఉండొచ్చని ట్రోల్ చేస్తున్నారు. కోటీశ్వరుడైన కథానాయకుడు తన ప్రేమ కోసం కథానాయిక ఇంట్లో పని వాడుగా చేరుతాడు. తనకు టుం బాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పని వాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడనేదే మిన్సార కన్నా. పారసైట్, షాప్ లిఫ్టర్ అనే చిత్రాన్నీ పోలి ఉందని మరి కొందరు వ్యాఖ్యానించారు.
ఇదీ పారసైట్
ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేద కుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాల్లో ఉన్న వారిని మోసగించి, ఆ ఇంటి నుంచి వెళ్ల గొడతారు. యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు కోల్పోయినవారికి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిపోతుంది. ఈలోపే విహారయాత్రకు వెళ్లిన యజమానులు తిరిగి వస్తున్నారనే వార్త ఆ కుటుంబీకుల చెవిన పడుతుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారనియజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే సినిమా ఇతివృత్తం. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరి స్థితులు ఏర్పడుతాయో పారాసైట్ అనే చిత్రంద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos