అప్సరసలు తలపించే అప్సరకొండ

  • In Tourism
  • November 8, 2019
  • 306 Views
అప్సరసలు తలపించే అప్సరకొండ

ఒత్తిళ్ల నుంచి ఉపశమన కలిగించి మనసులకు,మెదడుకు కొత్త ఉత్సాహాన్ని,ఆహ్లాదం పంచడంలో ప్రకృతి అందానికి ఉన్న స్థానమే ప్రత్యేకం.కులమతాలకు వయసుకు అతీతంగా ఎవ్వరినైనా అన అందం,మరికొన్ని అద్భుతాలతో ఆహ్లాదం ఆనందపరచటమే ప్రకృతికి తెలుసు. ఎంతటి బాధలు,ఒత్తిళ్లనైనా చిటికెలో మాయం చేసి మనసులు,మెదళ్లను మైమరిపిస్తాయి. వర్షంలో తడిసి ముద్దైన ప్రకృతి ప్రదేశాలను ఈ సమయంలో చూస్తే ఎవ్వరైనా ఆకర్షితులవ్వక తప్పదు.అటువంటి ప్రదేశం చూడాలంటే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర్ అనే పోర్ట్ పట్టణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అప్సరకొండ అనే అందమైన ప్రదేశం ఒకటుంది.

స్వాగతం పలికె వంతెన..


పేరుకు తగ్గట్లే ఈ ప్రాంతం అప్సరసల అందానికి ఏమాత్రం తీసిపోకుంటా ఉంటుంది. ‘భూమి మీద ఎటువంటి స్వర్గం లేదు కానీ దాని భాగాలు మాత్రం అక్కడక్కడా ఉన్నాయి’ అని ప్రముఖ పర్యాటకుడు జూల్స్ రెనార్డ్ అభివర్ణించారంటే అప్సరకొండ అందం ఎంతటి ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు.వాహనాలకు అనుమతి లేని అప్సరకొండకు చేరుకోవాలంటే చాలా దూరంలోనే వాటిని నిలిపివేసి లోపలికి ప్రవేశించాలి.అలా ప్రవేశించగానే ఇరువైపులా పచ్చనైన పందిళ్లతో అల్లుకుపోయిన వంతెన స్వాగతం పలుకుతుంది.అంతటి అందమైన వంతనె కింద గలగల సవ్వళ్లు చేస్తే పాకే సెలఏరు అందులో చిట్టి జలపుష్పాలు చూస్తే మనసు గాలిలో తేలిపోవడం తథ్యం.

వంతెన కింద పారుతున్న సెలయేరు


వంతెన దాటుకొని ఆలా మరింత లోపలికి వెళ్లగానే దర్శనమిచ్చే కొలనులు, జలపాతాలు, పచ్చదనం వీటన్నింటిని అప్సరసలతో పోల్చవచ్చు. పూర్వం అప్సరసలు ఈ ప్రదేశానికి ముగ్ధులై, కొంత కాలం ఇక్కడే నివాసం ఏర్పరుచుకొని, విశ్రాంతి పొందేవారట. అంతేకాదు ఇక్కడి కొండల మధ్య ప్రవహించే సెలయేర్లు, కొండ పై నుండి జాలువారే జలపాతాల చెంత స్నానాలు చేసేవారట. ఈ ప్రదేశం అప్సరసలకు నిలయం కనుకనే దీనికి అప్సరకొండ అనే పేరొచ్చిందని స్థానికులు చెప్పే చరిత్ర.పూర్వం సాధువులు మరియు సన్యాసులు ప్రశాంతమైన అప్సరకొండ ప్రదేశానికి ఆకర్షితులై ఇక్కడే ఉండిపోయారు. సమీప గుహలలో గంటల తరబడి ధాన్య ముద్రలో ఉండేవారు. కొంత మంది సన్యాసులు ఉమాంబ మహాగణపతి దేవాలయం, ఉగ్ర నరసింహ దేవాలయం నిర్మించారు. వీటిని కూడా ప్రకృతి ప్రేమికులు చూడవచ్చు.

అప్సరకొండ జలపాతం


అందమైన వ్యూ పాయింట్.


వనవాసంలో భాగంగా పాండవులు ఇక్కడ తలదాచుకున్నారని స్థానిక చరిత్ర.ఈ మేరకు ఇక్కడ నిర్మించిన పాండవుల గుహ కూడా చూడవలసిందే. పర్యాటకులు 155 మెట్లు ఎక్కి దేవాలయాలను, జలపాతాలను సందర్శించవచ్చు. అలానే కుడివైపు మళ్ళి కొంత దూరం నడిస్తే బీచ్ వెళ్ళవచ్చు.అప్సరకొండలో జలపాతం మరో ప్రత్యేక ఆకర్షణ. గుడి వద్ద ఉన్న జలపాతం పది అడుగుల ఎత్తునుండి కింద పడుతుంది.గుహల వద్ద కూడా కొన్ని జలపాతాలు ఉన్నాయి.విషపూరితమైన పాములు సంచరిస్తున్న నేపథ్యంలో ఈ జలపాతాల్లో జలకాలాడడాన్ని నిషేధించారు.అదేవిధంగా ఉమాంబ మహాగణపతి, ఉగ్ర నరసింహ దేవాలయాలను పూర్వం సిద్దులు గుహ గుండా వెళ్లి దర్శించుకొనేవారు. ఇప్పుడు ఆ గుహలను మూసివేశారు. భక్తులు వేరే మార్గం ద్వారా దేవాలయాల్లోకి ప్రవేశించవచ్చు. ఇప్పటికీ గుడి వద్ద ఉన్న జలపాటిహాలను దేవుళ్లను అభిషేకించటానికి ఉపయోగిస్తారు.

అబ్బుపరిచే రాతి శిల్పం.


అప్సరకొండ మరో విశేషం ఏంటంటే అప్సరకొండ ఐదు కిలోమీటర్ల పరిధి వరకు నీరు తియ్యగా ఉంటుంది. మీరు బోర్ వేసినా ఆ నీరు తియ్యదనాన్ని ఇస్తుంది. ఈ పరిధిని దాటితే నీరు ఉప్పగా ఉంటుంది.అప్సరకొండకు నాలుగు వైపులా నుంచి చేరుకోవచ్చు.అయితే ఒంటిరిగా ప్రయాణించడం, రాత్రుళ్ళు స్టే చేయడానికి అప్సరకొండ ఉత్తమం కాదు.విషపూరిత పాములు సంచరిస్తుండడంతో జలపాతాల్లో ఈత కొట్టే సమయంలో,ట్రెక్కింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఉమాంబ షాప్ వద్ద లభించే మజ్జిగ తప్పక తాగండి. ఇది తాగకపోతే మీ పర్యటన పూర్తికాదు. కొండపై కోతులు బెడద సైతం తీవ్రంగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలి.
అప్సరకొండ బీచ్ :
నిర్మానుష్యంగా దర్శనమిచ్చే అప్పరకొండ సముద్ర తీరాన్ని ఎకో బీచ్ అనికూడా పిలుస్తారు.ఎటువంటి దుకాణాలు,మనుషుల అరుపులు గోల లేకుండా నిర్మానుష్యంగా ఉండే అప్సరకొండ బీచ్ ప్రకృతి దృశ్యాలను అందించే అందమైన వ్యూ పాయింట్.

అప్సరకొండ బీచ్


ఇలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి 463 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొన్నావర్ పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి అప్సరకొండకు చేరుకోవాలి.లేదా శిర్సి చేరుకొని అక్కడి నుంచి చేరుకోవాలి.రైలు మార్గం మీదుగా కూడా అప్సరకొండకు చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos