ఆళ్ళగడ్డ పోలీసులపై కేసు

ఆళ్ళగడ్డ పోలీసులపై కేసు

హైదరాబాదు: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు ఇక్కడి ఆమె నివాసానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వెళ్లిన పుడు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆళ్లగడ్డకు పోలీసులు అఖిల ప్రియ ఇంటికి వెళ్లినపుడు సెర్చ్ వారెంట్ ఉందా? అది లేకుండా ఎలా వస్తారని? ఆమె ఆక్షేపించినపుడు వారి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తమ పక్కింటి నుంచి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపిం చారు. ఇంట్లో ని సామాన్లను కూడా వారు ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారని ఆగ్రహించారు. కర్నూలు జిల్లా పోలీసు సూపరెంటెం డెంట్ చట్ట విరుద్ధంగా ప్రవర్తించి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వారి దౌర్జన్యంపై కూడా పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos