చైనా ఆంక్షలతో యాపెల్ ఆదాయానికి గండి

చైనా ఆంక్షలతో యాపెల్ ఆదాయానికి గండి

బీజింగ్: చైనా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగటం తో యాపెల్ రెండు రోజుల్లో మూడు వేలకుపైగా గేమ్లను తొలగించించింది. దీంతో తొలగించిన గేమ్స్ సంఖ్య 4,500కు పెరిగింది. నిబంధనల్ని పాటించక పోవటమే ఇందుకు కారణం. 59 చైనా యాప్లపై భారత్ నిషేధించింది. జూలై 1 నుంచి చైనా నూతన అంతర్జాల విధానాన్ని అమలు చేస్తోంది. ఇది ఇరవై వేల యాప్లను ప్రభావితం చేస్తుందని అంచనా. నూతనన నియమాల ప్రకారం చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే గేమ్లు యాపిల్ యాప్ స్టోర్లో కి ఎక్కించాలి. ఇవి గేమ్ డెవలపర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని యాపిల్ చైనా మార్కెటింగ్ ప్రతినిధి తెలిపారు. చైనా ఏడాదికి 1,500 గేమ్లకు మాత్రమే లైసెన్సులు ఇస్తుంది. గేమ్లకు లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు చైనా ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం తీసుకుంటుంది. సెన్సర్ టవర్ డేటా ప్రకారం యాపిల్ యాప్ స్టోర్కు చైనా అతిపెద్ద మార్కెట్. యాప్ స్టోర్ ద్వారా చైనాలో ఏడాదికి 16.4 బిలయన్ డాలర్లు గడిస్తోంది. అమెరికాలో ఇది 15.4 బిలియన్ డాలర్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos