అహ్మద్ పటేల్​పై ఈడీ ప్రశ్నల వర్షం

అహ్మద్ పటేల్​పై ఈడీ ప్రశ్నల వర్షం

న్యూ ఢిల్లీ : నగదు అక్రమ బదిలీ కేసు లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ను ఇక్కడి ఆయన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం ప్రశ్నించారు. సందేశర గ్రూప్ లో జరిగిన రూ.5 వేల కోట్ల భారీ అవినీతిలో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండు సార్లు తాఖీదులు జారీ చేసారు. కరొనా వల్ల వైద్యుల సూచన మేరకు బయటకు రాలేనిని అహ్మద్ చెప్పడం బదులివ్వటంతో ఆయన నివాసానికే వెళ్లి విచారించారు. గుజరాత్కు చెందిన ప్రముఖ సంస్థ స్టెర్లింగ్ బయోటెక్.. మనీలాండరింగ్, బ్యాంకు మోసాలకు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. సందేశర బ్రదర్స్ చేతన్, నితిన్ సహా మరికొందరికి ఈ కేసుతో సంబంధాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos