అమరావతి : 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలను ఎట్టకేలకు కాగ్ విడుదల చేసింది. ఆదాయ, వ్యయాలు, లోటు, అప్పులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు వంటి వాటితో ఈ నివేదిక విడుదల కావడం గమనార్హం. ఇందులో బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు మధ్య భారీ అంతరాలు ఉండడం విశేషం. లోటు చివరి దశలో కొద్దిగా తగ్గినట్లు చూపించగా, రుణాలు మాత్రం అంచనాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలింది మొత్తం ఆదాయం 2.69 లక్షల కోట్లు వస్తురదని అంచనా వేయగా, చివరకు 2.50 లక్షల కోట్లు వచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. భారీగా రుణాలు తీసుకున్నా కూడా ఇంకా 19 వేల కోట్ల వరకు ఆదాయంలో కొరత కనిపించింది. వచ్చిన ఆదాయంలో పన్నులు, కేంద్రం నుంచి రు. 1.60 లక్షల కోట్ల వరకు సమకూరినట్లు తేలింది. ఇరదులో జిఎస్‌టి ద్వారా 47,853 కోట్లు రాగా, అంచనా కన్నా ఇది ఐదు వేల కోట్ల వరకు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక వ్యాట్ ద్వారా 24,500 కోట్లకుగాను 17,422 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ఎక్సయిజ్ డ్యూటీ విభాగంలో 25,597 కోట్లకుగాను 19,882 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 35,395 కోట్లకుగాను 36,869 కోట్లు రాగా, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు మాత్రర తగ్గినట్లు తేలింది. కేంద్రం నుంచి 30,333 కోట్లు రావాల్సి ఉండగా, 20,136 కోట్లు మాత్రమే చేతికందాయి.
వ్యయంలో విచిత్రాలు
ఇక వ్యయర విభాగంలో ఆసక్తికరమైన అరశాలు వెలుగుచూశాయి. వాస్తవానికి బడ్జెట్‌లో మొత్తం వ్యయాన్ని రు. 2.94 లక్షల కోట్లుగా చూపించగా, కాగ్ ప్రకటించిన ప్రాథమిక నివేదికలో మాత్రం ఏకంగా 3.37 లక్షల కోట్లుగా చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో కూడా బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వ్యయాన్ని 2.35 లక్షల కోట్లుగా, పెట్టుబడి వ్యయాన్ని 32,712 కోట్లుగా ప్రతిపాదించగా, తాజా కాగ్ నివేదికలో మాత్రం రెవెన్యూ వ్యయాన్నిరు. 2.91 లక్షల కోట్లుగా, పెట్టుబడి వ్యయాన్ని 45,382 కోట్లుగా చూపించారు. ఇరత తేడా ఎలా వచ్చిందన్నది మాత్రం అర్థంకాని విధంగానే ఉంది.