భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానుందా!

భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానుందా!

ప్రత్యేక రాష్ట్రం అవతరించాక ప్రతీ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌తో పేచీ పెట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది.గతంలో భద్రాచలం మాదేనని చంద్రబాబు అన్న నోటిమాటకే అంతెత్తున ఎగిరిపడ్డ కేసీఆర్‌ తాజాగా భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా ప్రతిపాదించినా సానులకూంగా స్పందించినట్లు వస్తున్న వార్తలు చూస్తే కేసీఆర్‌ వైఖరి మారినట్లు స్పష్టమవుతోంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్‌తో సమావేశమైన సమయంలో వైఎస్‌ జగన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించగా పరిశీలిస్తామని కేసీఆర్‌ చెప్పినట్లుగా సమాచారం.కేంద్ర ప్రభుత్వం కూడా భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనం చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే విలీనానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు మొదలయ్యాయని తెలుస్తోంది.అయితే విలీనం అంశం అంత తేలికైన విషయం కాదని రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది.అటుపై రెండు రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్‌లో సవరించాలి.అటుపై రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి ఇంత తతంగం పూర్తయితే భద్రాద్రి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనమవుతుంది.అయితే అంతకుముందు చాలా సమస్యలను దాటాల్సివస్తుంది.ఎందుకంటే గతంలో ఖమ్మంలోని ఏడు మండాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినపుడు తెలంగాణ ఉద్యమ సంఘాలు,తెరాస తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆందోళనలు చేశాయి.కాగా విలీనం చేసిన ఏడు మండలాలతో పాటు భద్రాచలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాల్సి ఉండగా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం సాఫీగా జరిగేందుకు,తెలంగాణ భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని భద్రాలచం విలీనాన్ని అప్పట్లో నిలిపివేశారు.తాజాగా మరోసారి ఈ విషయం ప్రస్తావనకు రావడంతో ఉద్యమ సంఘాలు మౌనంగా ఉంటాయా అనేది ప్రశ్న.కాగా భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలంటో భద్రాలచం పౌరసంఘాలు,వేదికలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్నికి విన్నవించినట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos