రస్సెల్ భార్యకు అభిమాని విన్నపం..

  • In Sports
  • October 12, 2020
  • 23 Views
రస్సెల్ భార్యకు అభిమాని విన్నపం..

విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్ భార్యకు ఓ అభిమాని ఇచ్చిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అతడు జట్టును గెలిపించే సత్తాను కలిగివుంటాడు. బంతిని సునాయాసంగా బౌండరీ దాటించగలడు. అంతేకాదు బౌండరీ లైన్‌ దగ్గర ఖచ్చితంగా సిక్స్ వెలుతుందనుకున్న బంతిని కూడా చాలా సులువుగా క్యాచ్‌లు పట్టిన సందర్భాలున్నాయి. అందుకనే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ భారీ మొత్తానికి ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది.కానీ గత సీజన్ కంటే ఈ సీజన్‌లో రస్సెల్ పెద్దగా రాణించలేదు. బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నప్పటికి బ్యాటింగ్‌లో చేతులెత్తేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రస్సెల్.. 50 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్‌ 24 పరుగులు మాత్రమే. ఇక బౌలింగ్‌లో ఐదు మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో కోల్‌కత్తా ఐదు మ్యాచ్‌లు ఆడగా.. మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ రాణా వంటి యువ క్రికెటర్లు రాణిస్తున్నా.. ఆండ్రూ రస్సెల్ ఇప్పటి వరకు తన సత్తా చాటడం లేదు. దీంతో రస్సెల్ ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ అభిమాని ఏకంగా ఒకడుగు ముందుకేశాడు. రస్సెల్ సతీమణికి మెసేజ్ పంపాడు. ”జస్సిమ్ లోరా ఆంటీ.. ప్లీజ్.. మీరు వెంటనే దుబాయ్ వెళ్లండి. ఆండ్రీ రస్సెల్ ఫామ్‌లో లేడు” అంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌ చేశాడు.దీనికి రస్సెల్‌ భార్య రిప్లై ఇచ్చింది. తన భర్త ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేసింది. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లున్నాయని.. రస్సెల్ ఫామ్‌లోకి రావడమే కాకుండా మైదానంలో ఆతడు త్వరలోనే విజృంభిస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. తాను దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఉండబోదని బదులిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos