ప్రధానితో అమోల్ యాదవ్ భేటీ

ప్రధానితో అమోల్ యాదవ్ భేటీ

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్రకు చెందిన పైలట్ అమోల్ యాదవ్ కలిశారు. దేశంలోనే తొలి విమాన తయారీ కేంద్రాన్ని ప్రారంభించడానికి అమోల్ యాదవ్ గత ఏడాది ఓ భారీ ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అతడి ప్రాజెక్టు గురించి తెలుసుకున్న ప్రధాని ఆయనకు తన మద్దతు ఉంటుందని తెలుపుతూ అభినందించారు. తన ప్రాజెక్టు గురించి మోదీ ఆరా తీయడంతో సమావేశం అనంతరం అమోల్ ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ‘మోదీ తన నివాసానికి నన్ను ఆహ్వానిస్తారని నేను అసలు ఊహించలేదు. ఆయన నా ప్రాజెక్టు గురించి తెలుసుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా కల నెరవేరాలని కోరుతూ, ఇందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టు గురించి గురించి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం నేను 19 సంవత్సరాలుగా పని చేస్తున్నా’ అని తెలిపారు. అమోల్ దాదాపు 19 సంవత్సరాలు శ్రమించి ఆరు సీట్ల సామర్థ్యం ఉండే విమానాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. ముంబయిలోని తన నివాసంపై ఉండే ఖాళీ స్థలంలోనే తయారు చేశారు. ఈ క్రమంలో ఆయన డీజీసీఏ (పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్) నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్ అనుమతి కోసం తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. ఇతడి ప్రాజెక్టును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తించి ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడి సమస్యను పరిష్కరించాలని ప్రధాని అధికారులకు సూచించారు.

తాజా సమాచారం