కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ సెప్టెంబరు నుంచి ఆరంభం

కాంగ్రెస్  పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ సెప్టెంబరు నుంచి ఆరంభం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ 2022 సెప్టెంబరులో ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీ తెలిపారు. శనివారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు.‘ కాంగ్రెస్ సమైక్యంగా ఉంది. పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సమావేశంలో జీ23 నేతల ప్రస్తావన రాలేదు. వారూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్గాలుగా కాంగ్రెస్ విడిపోలేదు.మేమంతా సమైక్యంగా ఉన్నాం. పార్టీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలంతా ఏకగ్రీవంగా కోరారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టడంపై నిర్ణయం తీసుకోవలసినది రాహుల్ గాంధీయే. ఈ ఎన్నికల ప్రక్రియ 2022 సెప్టెంబరులో ప్రారంభమవుతుందని’ విపులీకరించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘెల్ (ఛత్తీస్గఢ్), చరణ్జిత్ చన్ని (పంజాబ్) , నిరుడు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మా సమావేశానికి హాజరయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos