ఆరుగంటలపాటు సోదాలు

ఆరుగంటలపాటు సోదాలు

ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) గురువారం ఆరంభించింది. మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరు గంటల పాటు సోదా చేసి,ప్రశ్నల వర్షాన్ని కురిపిం చింది. ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు దర్యాప్తునకు కారణం. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడు. అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరించారు. శర్మను ఏప్రిల్లోనూ ప్రశ్నించారు కూడా. మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. వ్యాపారి మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos