అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వినతిని నిరాకరించిన ‘సుప్రీం’

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వినతిని నిరాకరించిన ‘సుప్రీం’

న్యూ ఢిల్లీ : ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌ల పై సీసీఐ జరుపుతున్న విచార ణను నిలిపేందుకు సోమవారం అత్యున్నత న్యాయ స్థానం నిరాకరించింది. వ్యాపారంలో స్పర్థ విధానాల్ని కాలరాచారనే నే ఆరోపణలపై సాగుతున్న విచారణ నిలుపుదలకు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ,న్యాయమూర్తులు వినీత్ శరణ్,  సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు వస్తువుల అమ్మకాల్లో అన్ని రకాల వస్తువులకూ సమాన  ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీ వ్యాపార మహా సంఘం కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి ఫిర్యాదు చేసింది. కొందరు వ్యాపారులకు అనుకూలంగా  వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది.  దీని పై తొలుత కర్నాటక ఉన్నత న్యామయస్థానం విచారణ చేపట్టింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీల మీద ప్రాధమిక విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో అవి సుప్రీం కోర్టును ఆశ్రయిం చాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు తమతంట తామే విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని  న్యాయమూర్తి రమణ అభిప్రాయపడ్డారు. అందుకు నాలు గు వారాల గడువు ఇచ్చారు. కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos