ఇన్ఫోసిస్ సీఈఓపై మరో ఆరోపణ

ఇన్ఫోసిస్ సీఈఓపై మరో ఆరోపణ

బెంగళూరు: ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సలిల్ పరేఖ్ పై మరోసారి ఆరోపణలు వచ్చాయి. పేరు వెల్లడించ కుండా మరో విజిల్ బ్లోయర్ సలిల్ పై చర్యలు తీసుకోవాలని చైర్మన్ నందన్ నీలేకని, పాలక మండలి సంచాలకులకు ఫిర్యాదు చేసాడు. ‘నేను ఆర్ధిక విభాగం ఉద్యోగిని. పేరు బహిర్గతం అయితే ప్రతీకారం తీర్చుకుంటారనే భయం ఉంద’ని వివరిం చారు. సలిల్ పరేఖ్, కంపెనీలో చేరి ఎనిమిది నెలలు గడిచినా బెంగళూరుకు నివాసాన్ని మార్చలేదు. ఇది నిబంధ నలకు విరుద్ధం. సంస్థ విలువను, వ్యవస్థలను క్షీణింపజేసేలా ఆయన చర్యలు ఉన్నందున కొన్ని వాస్తవాలను పాలక మండలి దృష్టికి తేవ డాన్ని కర్తవ్యంగా భావించినట్లు’ వివరించాడు. ‘కేవలం తన వ్యాపార ప్రయోజనాలు మాత్రమే సలిల్ పరేఖ్ కు ముఖ్యం. అందుకే  ఆయన ముంబైలోనే మకాం వేసారు. ఆయనకు స్టాక్ మార్కెట్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని చాలా మంది సంస్థ ఉన్నత ఉద్యోగులు కచ్చేరీకి రావడం మానేశారు. నెలకు రెండు సార్లు వచ్చి వెళ్లేందుకు విమాన ప్రయాణ రుసుము, ఇతర రవాణా నిమిత్తం ఆయన రూ. 22 లక్షలు తీసుకు న్నార’ని ఆరోపించాడు.దీనికి ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos