గడ్డం తీయనందుకు ఎస్సై సస్పెన్షన్‌

గడ్డం తీయనందుకు ఎస్సై సస్పెన్షన్‌

లక్నో: గడ్డం చేసుకోనందుకు ఎస్ఐ ఇంటెసర్ అలీ బాగ్పత్ను సస్పెండ్ చేసారు. గడ్డం చేయించుకోవాలని ఉన్నతాధికారులు ఇప్పటికే మూడు సార్లు ఆదేశించారు. అతను వాటిని పట్టించుకోలేదు. దీని గురించి బాగ్పత్ ఎస్పీ అభిషేక్ సింగ్ వివరించారు. ‘పోలీసు మాన్యువల్ ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకో వడానికి అనుమతి ఉంది. మిగతావారందరూ నీట్గా గడ్డం చేయించుకోవాల్సిందే. ఒకవేళా గడ్డం ఉంచుకోవాలనుకుంటే అతను దాని కోసం అనుమతి తీసు కోవాలి. ఈ క్రమంలో ఇంటెసర్ అలీని పదే పదే అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించాము. అతడు దానిని పాటించలేదు.. అనుమతి లేకుండా గడ్డం ఉంచు కున్నాడు. దాంతో సస్పెండ్ చేశాం’ అని తెలిపారు. ‘గడ్డం ఉంచడానికి అనుమతి కోరుతూ నేను దరఖాస్తు చేశాను.. కానీ స్పందన రాలేదు’ అని ఇంతెసర్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos