నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా ఉండటానికి ఇల్లే లేదు

నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా ఉండటానికి ఇల్లే లేదు

పట్నా: ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కోట్ల రూపాయాలు పోగేసుకుని, విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారు. అలాంటిది నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా కనీసం పక్కా ఇల్లు కూడా కట్టుకోలేదు. ఆయనే బీహార్కు చెందిన సీపీఐ శాసనసభ్యుడు మహబూబ్ ఆలమ్. ఈ రోజుల్లోనూ ఇలాంటి ప్రజానేత ఉంటారా? అని విస్మయం కలగకమానదు. ఇటీవల జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలుపొందారు. కోసి ప్రాంతంలోని కటిహార్ జిల్లా బలరామ్పూర్ నుంచి నాలుగో సారి విజయం సాధించారు.ఆయనకు పక్కా ఇల్లే కాదు. ఈరోజుకీ ఎక్కడికి వెళ్లాలన్నా నడుచుకునే వెళుతుంటారు. బీహార్ శాసన సభకు కొత్తగా ఎన్నికైన వారిలో 81 శాతం మంది కోటీశ్వరులు. మహబూబ్ ఆలమ్ తీరు వీరిందరికన్నా భిన్నం కావటంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వికాశ్షీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి వీరేంద్ర కుమార్ ఓజాపై 53 వేల ఓట్ల భారీ మెజా రిటీతో విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించిన సీపీఎం (ఎంఎల్) ఎమ్మెల్యేలో ఆలమ్ ఒకరు. ఆ ఎన్ని కల్లో జేడీయూ- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి, బీజేపీతో కూడిన ఎన్డీఏ పోటీచేశాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరౌన్ కుమార్పై 20,419 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 31.7 శాతం ఆలమ్కు దక్కాయి. మహబూబ్ ఆలమ్ (44) 10వ తరగతి పాసయ్యారు. వ్యవ సాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎన్నికల నామపత్రంతో జతపరచిన ప్రమాణ పత్రంలో తనకు ఎటువంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు. బిహార్ శాసనసభకు ఎన్నికైన మొత్తం 243 మంది ఎమ్మెల్యేల్లో 192 మంది కోటీశ్వరులే. వీరి సగటు ఆస్తి రూ.453 కోట్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos