కరోనాసై యుద్ధానికి అక్షయ్‌ భారీ విరాళం..

  • In Film
  • March 29, 2020
  • 110 Views
కరోనాసై యుద్ధానికి అక్షయ్‌ భారీ విరాళం..

దేశానికి కానీ కళాకారులకు కానీ ఎటువంటి ఆపద,విపత్కర పరిస్థితులు తలెత్తినా అన్ని విధాలుగా సహాయం అందించడానికి మొదటగా ముందుకు వచ్చేది బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ మాత్రమే.గతంలో ఎన్నో సందర్భాల్లో దాతృత్వాన్ని చాటుకున్న అక్షయ్‌ తాజాగా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనావైరస్‌పై కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించి తాను రీల్ హీరోను మాత్రమే కాదు… రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు. దేశం కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్‌పై  కేంద్రం చేస్తోన్న పోరాటానికి మద్దతుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించి తాను రీల్ హీరోను మాత్రమే కాదు… రియల్ హీరోను కూడా అని అనిపించుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయం అందించే సహాయ నిధి పీఎం కేర్స్ ఫండ్‌కి అక్షయ్ కుమార్ ఒకటి కాదు.. రెండు కాదు..  ఏకంగా రూ. 25 కోట్ల భారీ విరాళం అందించనున్నట్టు ప్రకటించి అవసరంలో ఉన్న వారికి తానున్నానని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ ఆపత్కాలంలో మానవాళిని రక్షించుకోవాల్సిన సమయం ఇదేనని.. అందుకోసం మనకు తోచిన సాయాన్ని మనం చేద్దామని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చాడు. అక్షయ్ కుమార్ చేసిన ఈ సాయం బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలిచింది. తన భర్త భారీ మొత్తంలో విరాళం ప్రకటించడంపై అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా సంతోషం వ్యక్తం చేస్తూనే.. అంతకుముందు అక్షయ్‌తో జరిగిన సంభాషణను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్లు ప్రకటించిన అక్షయ్ తనను గర్వపడేలా చేశాడని పేర్కొన్న ట్వింకిల్.. మరీ అంతమొత్తంలో ప్రకటిస్తే ఎలా అని, మనకి కూడా డబ్బులు అవసరం కదా అని ప్రశ్నించానని తెలిపింది. దీనికి అక్షయ్ బదులిస్తూ.. తాను కెరియర్ ప్రారంభించినప్పుడు తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని, కానీ ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని గుర్తు చేశాడని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయకుండా ఉండలేనని అన్నాడని ట్వింకిల్ తెలిపింది.అంతకంటే ముందుగా ప్రముఖ కమెడియన్, బుల్లితెర వ్యాఖ్యాత కపిల్ శర్మ సైతం ప్రధాని రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కష్టకాలంలో మన అవసరం ఉన్న వారికి మనం తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని కపిల్ శర్మ ట్వీట్ చేశాడు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos