రాత్రివేళ అగ్ని-3 పరీక్ష..

రాత్రివేళ అగ్ని-3 పరీక్ష..

పాకిస్థాన్‌తో పాటు చుట్టుపక్కల దేశాల నుంచి సైనిక ముప్పుతో పాటు ఉగ్రవాదుల ముప్పు కూడా పొంచి ఉండడంతో భారతదేశం అధునాతన అణ్వాస్త్రాలను సమకూర్చుకుంటోంది.ఈ నేపథ్యంలో అణ్వస్త్రాలను దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి శత్రువులపై ప్రయోగించి రాగల ఖండాంతర క్షిపణి అగ్ని-3ని శాస్త్రవేత్తలు తొలిసారిగా రాత్రి సమయంలో ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి దీన్ని ప్రయోగించినట్టు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్కలాం దీవిలోని ఇంటిగ్రేటెడ్టెస్ట్రేంజ్నుంచి దీన్ని రాత్రి 7.20 గంటలకు మొబైల్లాంచర్ద్వారా ప్రయోగించామని, క్షిపణి వెళ్లిన మార్గాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.అగ్ని-3 క్షిపణి ప్రయోగ పరీక్ష ఫలితం కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అగ్ని-3, 1,500 కిలోల వార్ హెడ్ లను మోసుకు వెళుతుంది. 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 టన్నుల బరువుతో ఉంటుంది. ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలోకి అగ్ని-3 చేరిందన్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం