మోదీ ఉన్నంత కాలం ఇంతే

మోదీ ఉన్నంత కాలం ఇంతే

కరాచీ:మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం భారత్- పాక్ల మధ్య క్రికెట్ పోటీలు జరగవని మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మంగళ వారం ఇక్కడ ఒక టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యాఖ్యానించాడు.’భారత్, పాక్ల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయ నే భారత ప్రధాని మోదీ.ఆయన అధికారంలో ఉన్నంత వరకు భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు.అసలు మోదీ లక్ష్యం ఏమిటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు.సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయా ణించాలని చూస్తున్నారు. మోదీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి’అని పేర్కొన్నారు.భారత జట్టు చివరి సారిగా రాహు ల్ ద్రవిడ్ నాయకత్వంలో 2006లో పాక్లో పర్యటించింది. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐసీసీ వేదికగా జరిగిన పోటీల్లో తప్ప భారత్- పాక్ మధ్య పోటీలు జరగలేదు. చివరిసారిగా 2008లో రెండు జట్ల మధ్య ద్వై పాక్షిక టెస్టు సిరీస్ జరిగితే.. 2013 నుంచి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos