20.40లక్షల ఇళ్ల మంజూరు

20.40లక్షల  ఇళ్ల మంజూరు

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నగర,పట్టణాలకు  20,40,390 ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  కౌశల్ కిషోర్ గురువారం లోక్‌సభలో సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి లిఖిత పూర్వకంగా తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20,40,390 గృహాలను మంజూరు చేసినట్లు తెలిపారు.  నెల్లూరుజిల్లాలో 1,34, 043 ఇళ్లు, ప్రకాశం జిల్లాలో 1,11,292 ఇళ్లు మంజూరు అయినట్లు వివరించారు.  మిగతా 11 జిల్లాలకు అక్కడి అవసరాలను బట్టి ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అమృత్ పథకం కింద 470 నగరాలు, పట్టణాల్లో క్రెడిట్ రేటింగ్ వర్క్ పూర్తయిందని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు.రాష్ట్రంలోని 32 నగరాలు, పట్టణాల్లో నెల్లూరు, కావలి కూడా  ఉన్నాయని పేర్కొన్నారు.

తాజా సమాచారం