మందుల కొనుగోళ్లలో అవినీతి లేదు

మందుల కొనుగోళ్లలో అవినీతి లేదు

నెల్లూరు: ఈఎస్ఐ ఆస్పత్రులకు నిబంధనల మేరకే మందుల కొంటున్నామని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సోమవారం లోక్సభలో నెల్లూరు సభ్యుడు ఆదాల ప్రభాకర రెడ్డికి తెలిపారు. హైదరాబాదు ఈఎస్ఐ ఆసు పత్రుల్లో జరిగిన మందుల కొనుగోలు అవకతవకల్ని ప్రస్తావించినపుడు ఈ మేరకుబదులిచ్చారు. ‘ఎవరినైనా అరెస్టు చేశారా? ఈ ఎస్ ఐ ఆసుపత్రుల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారా’నీ ప్రశ్నించారు. ‘ఒక అధికారిని అరెస్టు చేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ సమాచారం మాకు చేరింది. దీంతో ఎప్పటికప్పుడు మందుల కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మం దు ల ధరల నిర్ధారణలోనూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఆర్థిక లావాదేవీల్లో నిబంధనలకు అనుగుణంగా వ్యవహారాలు జరిగేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నామని’ విశదీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos