నెల్లూరు: దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో సోమవారం వేగంగా వెళ్తున్న వ్యాను అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో ఉన్న వెంకటేశ్వర్లు, ఆయన భార్య స్వర్ణలత అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృత దేహాలను పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.