బ్యాంకు చోరీ ఇంటి దొంగల పనే

బ్యాంకు చోరీ ఇంటి దొంగల పనే

చిత్తూరు: యాదమరి ఆంధ్రాబ్యాంకు శాఖలో జరిగిన భారీ చోరీ ఇంటి దొంగల పనేనని పోలీసులు నిర్థారించారు. మోర్థానపల్లి వద్ద ఉన్న ఆంధ్రా బ్యాంక్లో  గత సోమవారం రూ.3.45 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదు చోరీ జరిగింది. బ్యాంక్లోని సీసీ కెమెరాల పుటేజీని నిక్షిప్తం చేసే హార్డ్ డిస్క్ ముందుగానే మాయం కావడం, బ్యాంకు ప్రధాన ద్వారం, లోపలి లాకర్ తాళాలు యథాతథంగా ఉండడం, లాకర్లోని ఆభరణాలు మాత్రం మాయం అయినందున కచ్చితంగా బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉంటుందని అనుమానించిన పోలీసులు తొలుత బ్యాంక్ మేనేజర్ పురుషోత్తాన్ని, క్యాషియర్ నారాయణను విచారించారు. విచారణలో వారిద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులను వి చా రిం చారు.చివరగా ప్రధాన మార్గాల్లోని సీసీ కెమెరా పుటేజీ, కాల్ రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినపుడు బ్రాంచి మేనేజర్, క్యాషియ ర్తో పాటు అప్రైజర్ కూడా చోరీలో కుట్రదారుగా తేలాడు. చోరీ సొత్తును బంగారాన్ని బ్యాంకు పరిసరాల్లోని గుట్టల్లో, ఇతర ప్రదేశాల్లో పూడ్చి పెట్టారు. చోరీ అయిన బంగారంలో సగం వరకు స్వాధీనం చేసుకున్నారు. కొంత బంగారాన్ని నిందితులు కరిగించారు. దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమా చారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos