ముందుంది అసలు పరీక్ష..

ముందుంది అసలు పరీక్ష..

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ఇక ముందు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఎన్నికల్లో ఎలాగూ గెలవలేననే నమ్మకంతో చెప్పారో లేదా గెలవడానికి చెప్పారో తెలియదు కానీ తాను ఎంపీగా గెలిస్తే ఐదు గంటల్లో పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి గెలిచాక విస్మరించే రకం నేను కాదని గెలిస్తే కచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతానంటూ శపథం చేశారు.అంతటితో ఆగకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయినా ఎర్రజొన్న పంటకు మద్దతుధర తీసుకురాలకపోయినా పదవికి రాజీనామా చేసి రైతులతో కలసి ఉద్యమంలో పాల్గొంటానని బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చారు.మరి ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన ధర్మపురి ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై,ఎర్రజొన్న పంటకు మద్దతుధర ఇప్పించడంపై కసరత్తులు మొదలుపెట్టాలి. దీంతో పాటు బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు.ఇవన్నీ చేయడంలో కేసీఆర్‌ తనయురాలు కల్వకుంట్ల కవిత విఫలమయ్యారని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నా,ఎర్రజొన్న రైతులకు న్యాయం జరగాలన్నా,బోధన్‌ చక్కె కర్మాగారం తిరిగి తెచురుకోవాలన్నా కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ప్రచారం చేసి కవితపై రైతుల్లో వ్యక్తమైన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించారు.ఇంతవరకు వ్యూహాత్మంగా, క్రీయాశీలకంగా వ్యవహరించిన ధర్మపురి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా ఇదే నిబద్దత,దూకుడు ప్రదర్శించాలంటూ ఓటర్లు తెలుపుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos