అరగంటలో 134 వంటకాలు

అరగంటలో 134 వంటకాలు

చెన్నై : మహిళలు రోజువారీ రెండు మూడు రకాల వంటకాలు చేయాలంటే ఎంత లేదనుకున్నా.. అరగంట నుంచి గంట సమయం పడుతుంది. ఇక స్పెషల్ వంటకమైతే మరికొంత సమయం పడుతుంది. అలాంటిది అరగంటలో 134 రకాలు వంటకాలు తయారుచేసి.. ఓ మహిళ గిన్నీస్ రికార్డుకెక్కింది. ఇంత వేగంగా వంటకాలను తయారుచేసిన ఆ మహిళ ఎవరు అనునుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా తిరుమంగలానికి చెందిన ఇందిరా రవిచంద్రన్. ఆమెకి వంట చేయడమంటే చాలా ఇష్టమట. ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ వంటకాలు వండి.. రికార్డుకెక్కాలని ఆశపడింది. దానికి తగ్గట్టుగా.. ఆమె ఎంతో సాధన చేసింది. ఆమె కోరుకున్నట్లుగానే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి పర్యవేక్షణలో సోమవారం 30 నిమిషాల్లో శాఖాహార, మాంసాహార వంటలు కలిపి 134 రకాల ఆహార పదార్థాలను తయారు చేశారు. దీంతో ఆమె తక్కువ సమయంలో ఎక్కువ పదార్థాలను తయారుచేసిన మహిళగా రికార్డుకెక్కింది. ఇంతకుమందు కేరళకు చెందిన హెయన్ అనే పదేళ్ల బాలుడు 122 రకాల వంటకాలు తయారుచేసి..గిన్నీస్ రికార్డుకెక్కగా.. ఆ రికార్డును ఇందిరా బద్దలు కొట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos