హైబీపీ, గుండె జ‌బ్బుల‌కు3 బ్ర‌హ్మాస్త్రాలు..

హైబీపీ, గుండె జ‌బ్బుల‌కు3 బ్ర‌హ్మాస్త్రాలు..

హైప‌ర్ టెన్ష‌న్ లేదా హై బ్ల‌డ్ ప్రెష‌ర్‌.. ఎలా పిలిచినా ఈ స‌మ‌స్య గ‌న‌క వ‌చ్చిందంటే.. తీవ్ర‌మైన గుండె జ‌బ్బులు, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. హైబీపీ స‌మ‌స్య ఉన్న వారి శ‌రీరంలోని ర‌క్త నాళాల గోడ‌ల‌పై ఒత్తిడిని క‌ల‌గ‌జేస్తూ ర‌క్తం పంప్ అవుతుంది. దీని వ‌ల్ల ర‌క్త‌నాళాల గోడ‌లు కుచించుకుపోతాయి. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం వంటి ప‌నుల వ‌ల్ల హైబీపీ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ స‌మ‌స్య నిజానికి ఓ సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఎందుకంటే హైబీపీ ఆరంభంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌నిపించ‌వు. కానీ ముదిరితే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. క‌నుక హైబీపీ స‌మ‌స్య‌ను ముందుగానే గుర్తించాలి. డాక్ట‌ర్ల‌చే త‌ర‌చూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అల‌వాట్లు, నిత్యం వ్యాయామం చేయ‌డం, మ‌ద్యపానం, ధూమ‌పానం మానేయ‌డం వంటి సూచ‌న‌లు పాటిస్తే హైబీపీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. హైబీపీ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. అయితే బీపీని కంట్రోల్ చేయ‌డంలో మూడు ముఖ్య పోష‌కాలైన కాల్షియం, మెగ్నిషియం, పొటాషియంలు కీల‌క పాత్ర పోషిస్తాయి. నిత్యం మ‌నం తీసుకునే ఆహారంలో ఈ మూడు పోష‌కాలు క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని వ‌ల్ల హైబీపీని త‌గ్గించుకోవ‌చ్చు. ర‌క్త‌నాళాల గోడ‌ల‌ను సాగేలా చేసి ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌ర‌చ‌డంలో పొటాషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ర‌క్త‌పోటును షుగ‌ర్ లెవల్స్‌ను నియంత్రించేందుకు, నాడుల‌ను స‌రిగ్గా ప‌నిచేయించేందుకు మెగ్నిషియం పనికొస్తుంది. ఇక కాల్షియం హైబీపీని త‌గ్గిస్తుంది. శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తింప‌బ‌డేందుకు అవ‌స‌ర‌మయ్యే కీల‌క‌మైన హార్మోన్లు, ఎంజైమ్‌లు స‌రిగ్గా విడుద‌ల‌య్యేందుకు కాల్షియం ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. హైబీపీ కూడా త‌గ్గుతుంది. 
నారింజ పండ్లు, పుట్ట‌గొడుగులు, పాల‌కూర‌, కంద గ‌డ్డ‌లు, బ్రొకొలి, అర‌టి పండ్లు, యాప్రికాట్స్‌ల‌లో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే అవ‌కాడొ, కేల్‌, బాదం, పిస్తా ప‌ప్పు, వాల్‌న‌ట్స్‌, గుమ్మ‌డికాయ‌, పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో మెగ్నిషియం ఉంటుంది. ఇక చేప‌లు, గుడ్లు, పాలు, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు త‌దిత‌రాల్లో కాల్షియం మ‌న‌కు పుష్క‌లంగా ల‌భిస్తుంది. వీటిని రోజూ తింటే హైబీపీ, గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..! 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos