వినియోగదారుల చెంతకుబ్యాంకు సేవలు

వినియోగదారుల చెంతకుబ్యాంకు సేవలు

విజయవాడ: బ్యాంకింగ్‌ సేవలు వినియోగదారుల చెంతకు తీసుకువెళ్లేందుకు వీలుగా మొబైల్‌ డిమాన్‌స్ట్రేషన్‌ వ్యాన్‌ సిస్టమ్‌ను ప్రవేశపెడు తున్నట్లు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) సీజీయం కె. సురేష్‌కుమార్‌ తెలిపారు. గవర్నర్‌పేటలోని ఏపీ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (అప్‌కాబ్‌) కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం మొబైల్‌ డిమానుస్ట్రేషన్‌ వ్యాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అన్ని బ్యాంకుల సేవలు గ్రామాల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ బ్యాంకులందించే సేవలు, రైతులకు కల్పిస్తున్న రుణ విధానాలు ప్రచారం చేయడంతో పాటు ఏటీఎం సర్వీసులు కూడా వ్యాన్‌ వద్దనే లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మొబైల్‌ వ్యాన్‌లు అందుబాటులో ఉన్నాయని, బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా ఇవి వెళతాయని తెలిపారు. ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏవీ భవానీశంకర్‌,సీనియర్‌ అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos