పదవి పెద్ద గుదిబండ

అనంతపురం: ఎమ్మెల్యే పదవి పెద్ద గుదిబండ అని జే.సీ ప్రభాకర్‌రెడ్డివ్యాఖ్యానించారు. . మండల కేంద్రం పెద్దవడుగూరులో  శుక్రవారం జరిగిన ఉచిత డ్రైవింగ్‌ లైసెన్సుల వితరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  తనలాంటి వారికి ఆ పదవి సరిపోదని, ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆక్రోశించారు. పుట్టిన మనిషి ఏదో ఒక మంచి పని చేసి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పరచు కునేందుకు తపన పడాలని పిలుపు నిచ్చారు. అందుకే సమే తన జీవితమంతా ధారపోసి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. 40 సంవత్సరాల నుంచి తమ కుటుంబాన్ని కంటికి రెప్ప లా కాపాడుతున్న తాడిపత్రి ప్రాంత ప్రజలు గుండెను గుడిగా పెట్టుకొని చూసుకుంటు న్నారన్నారు. పెద్దవడు గూరు మండలాన్ని అద్దంలా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు వ్యక్తిగత అలంకరణపై ఉన్న శ్రద్ధను పరిసరాల పరి శుభ్రతపై పెట్టుకుంటే నందనవనం ఆవిర్భ విస్తుందన్నారు. కేవలం డబ్బుల వల్ల పనులు జరగవని, ప్రజల ఆద రాభిమానాల వల్లే ఏదైనా సాధ్యమవుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos