తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

హైదరాబాదు:ఇక్కడి రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ వైభవంగా జరిగింది.
పది మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. తొలుత ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత వరుసగా తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, ఈటెల రాజేందర్, నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విధాన పరిషత్తు అధ్యక్షులు స్వామిగౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్‌రావు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.గవర్నర్‌ నరసింహన్‌ వారిచే ప్రమాణాల్ని చేయించారు.
గత మంత్రి వర్గ సభ్యులు ఈటల, జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసానికి మళ్లీ పదవులు దక్కాయి. ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల, శ్రీనివాస్ గౌడ్,తొలి సారిగా మంత్రులుగా ప్రమాణాల్నిచేసారు.  సామాజిక వర్గాలవారీగా మంత్రి పదవులు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో ఆరుగురితో తుది విస్తరణ జరుగనుంది.

అసంతృప్తి
లేదు:హరీశ రావు

కొలువులో స్థానం లభించనందుకు
తనకు ఏ విధమైన అసంతృప్తి లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే,
ముఖ్యమంత్రి కెసిఆర్‌ మేనల్లుడు  హరీశ్‌రావు తెలిపారు.  మంత్రుల ప్రమాణం
తర్వాత ఆయనమాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని
కొని యాడారు. ‘‘తెరాసలో తాను సైనికుడిలాంటి క్రమశిక్షణ గల కార్యకర్త నని.. కేసీఆర్‌ ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల ముందు పదుల సార్లు  చెప్పాను  మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రాంతాలు, సామాజిక వర్గాల సంతులితాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేసారు. సామాజిక మాధ్యమంలో నాకు
వ్యతిరేకంగా  జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నా.  ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రచారం  కొనసాగిస్తే
 దాన్ని పట్టించుకోవద్ద ’న్నారు. పార్టీ కోసం కేసీఆర్‌ నాయకత్వంలో అందరూ పని చేయాలని   నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కెటిఆర్‌ శుభాకాంక్షలు

కొలువుదీరిన కొత్త మంత్రివర్గానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌ లో శుభాకాంక్షలు తెలిపారు.‘‘ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos